వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పట్టణంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరకాలలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీలో ప్రస్తుత పరిస్థితులపై ఛైర్మన్, కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు.
మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. వైరస్ విజృంభిస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజలు సైతం మాస్కులు లేకుండా బయట తిరగొద్దని.. భౌతిక దూరం పాటించాలని కోరారు.
హరితహారంలో నాటిన మొక్కలను కాపాడే బాధ్యత మున్సిపల్ సిబ్బంది తీసుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అనితా రామకృష్ణ, వైస్ ఛైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, కమిషనర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!