ఔటర్ రింగురోడ్డు నిర్మాణ పనుల కోసం తిరిగే లారీల వల్ల తమ గ్రామ ప్రధాన రహదారి దెబ్బతిందని వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్అండ్టీ కంపెనీ ఏర్పాటు చేసిన ప్లాంటు ముందు వారు ధర్నా చేశారు. ముడి పదార్థాలు తీసుకెళ్లే లారీలు అధిక లోడుతో ఉండడం వల్ల ప్రధాన రహదారి దెబ్బతిందని..తమ గ్రామానికి ఎల్అండ్టీ నిర్మాణ సంస్థే నూతన రహదారి వేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
కొత్త రహదారి నిర్మాణానికి అంగీకారం
రహదారి నిర్మాణం విషయంలో సంస్థ అధికారులకు, వారికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రోడ్డు నిర్మించడానికి సంస్థ అధికారులు అంగీకరించారు. ప్రారంభ సూచకంగా అధికారులు, గ్రామస్థులు కూడలి వద్ద కొబ్బరికాయలు కొట్టారు.
ఇదీ చూడండి : మంత్రి సమావేశంలో 'నిద్రలో జోగుతున్న' అధికారులు