దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన పింఛనుదారులు సోమవారం వరంగల్ గ్రామీణ కలెక్టర్ కార్యాలయం... ఎప్పటికంటే ఎక్కువ మంది జనంతో నిండిపోయింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లకు దరఖాస్తులు సమర్పించేందుకు జనం భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్ నుంచి రశీదు తీసుకొచ్చిన వారికే అవకాశం ఉందని కొత్తగా ఎన్నికైన సర్పంచులు చెప్పడంతో.. ఒక్కసారిగా కలెక్టరేట్పై పడ్డారు. వికలాంగుల కోటాలో వచ్చిన వారిలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు కూడా ఉండటం విశేషం.
చాలామంది ఉదయం నుంచే కలెక్టరేట్ వద్ద పడిగాపులు పడ్డారు. ఊళ్లలో రశీదు తెచ్చిన వారికే పింఛను వస్తుందని చెబుతున్నారని... ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు.
మొత్తం మీద గ్రామాల్లో కొత్త సర్పంచులు చేసిన ప్రకటన... కలెక్టరేట్ సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేసింది.