గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. పెరకవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
![peaceful polling in greater warangal elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-16-30-vip-polling-av-ts10076_30042021114430_3004f_1619763270_247.jpg)
మట్టెవాడ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య.. కుటుంబ సమేతంగా ఓటు వేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్లలో తెరాస జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే నరేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇస్లామియా కాలేజ్ వద్ద పోలింగ్ ప్రక్రియను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ పుష్ప పరిశీలించారు.
ఇదీ చూడండి: 3 మున్సిపాలిటీల్లో 9 వరకు సగటున 10 శాతం పోలింగ్