రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉండాలనేది సీఏం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని సలివాగు శివారులో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
కంట నీరు రాకూడదని...
రూ.3కోట్ల 90 లక్షలతో నిర్మిస్తున్న ఈ చెక్ డ్యాం వలన సుమారు 400 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు.. కష్టాలతో కంట నీరు రాకూడదని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగా .. రైతు సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతు వేదికలను ఏర్పాటు చేసిన కర్షక బాంధవుడని కొనియాడారు.