ETV Bharat / state

ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: చల్లా ధర్మారెడ్డి - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్తలు

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చల్లా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

MLA challa dharma reddy, parakala
చెన్నకేశవస్వామిని దర్శించుకున్న పరకాల ఎమ్మెల్యే దంపతులు
author img

By

Published : Mar 28, 2021, 5:12 PM IST

చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హోలీ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలోని ఆలయంలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో సతీసమేతంగా ఆయన పాల్గొన్నారు.

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే దంపతులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆ తర్వాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు.

ఇదీ చూడండి: జర్నలిస్టులకు సురవరం ఆదర్శం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.