ETV Bharat / state

Minister Errabelli : కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే వడ్లు కొనలేక పోతున్నాం: మంత్రి ఎర్రబెల్లి - తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వచ్చే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. లాభసాటి వ్యవసాయంతో రైతులు నూతన ఒరవడిని తీసుకురావాలని కోరారు.

Minister Errabelli
Minister Errabelli
author img

By

Published : Nov 8, 2021, 3:54 PM IST

కేంద్రం సహకరించకపోయినా ఈ ఏడాది ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగొద్దనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తీర్మాలయాపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.

గతేది కొన్న ధాన్యం నిలువలు గోదాముల్లో పేరుకుపోయాయని తెలిపారు. వచ్చే యాసంగిలో వరి పంట వేసి రైతులు నష్టపోకూడదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వడ్లను కొనేపరిస్థితి లేదని పేర్కొన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. లాభసాటి వ్యవసాయంతో రైతులు నూతన ఒరవడిని తీసుకురావాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు రైతులు వేసేట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గత రెండేళ్ల నుంచి కొన్న వరి ధాన్యం నిలువలు గోదాముల్లో పేరుకుపోయాయి. మన రాష్ట్రంలో పండిన వరి ధాన్యంలో మనం 5శాతం కూడా తినం. మనం దొడ్డు రకం వడ్లు వేస్తాం. కానీ సన్న వడ్లు తింటాం. దీంతో దొడ్డొడ్లు గోదాముల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగొద్దనే ఆలోచనతోనే ఈసారి ధాన్యం కొనుగోలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వడ్లను కొనేపరిస్థితి లేదు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. లాభసాటి వ్యవసాయంతో రైతులు నూతన ఒరవడిని తీసుకురావాలి. -ఎర్రబెల్లి దయాకర్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చదవండి: CM KCR Tour Latest News: ఎల్లుండి ఆ జిల్లాల్లో సీఎం కేసీఆర్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.