ETV Bharat / state

పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం - దసరాకు పాలపిట్ట దర్శనం

పాలపిట్ట దర్శనంతోనే దసరా సంబురాలు పరిపూర్ణం అవుతాయని రాష్ట్ర ప్రజల విశ్వాసం. ముఖ్యంగా పండుగరోజు పాలపిట్టను చూడటానికి చిన్నాపెద్దా, పిల్లాజెల్లా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. అలాంటిది వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట ప్రజలకు ఆ పాలపిట్ట దర్శనం లభించింది. మనమూ ఆ ఎక్స్​క్లూసివ్​ విజువల్స్​ను చూసి మన దసరా సంబురాలను అంబరాన్నంటేలా చేసుకుందామా..!

Palapitta was seen in Wardhannapet Warangal rural district of  during Dussehra
పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం
author img

By

Published : Oct 25, 2020, 6:46 PM IST

Updated : Oct 25, 2020, 7:10 PM IST

దసరా పర్వదినాన జమ్మి అనంతరం పాలపిట్ట చూడడం ఆనవాయితీగా పెద్దలు చెబుతారు. పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నమని విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు.

పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పాలపిట్ట దర్శనం ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ విజువల్స్ ఈటీవి భారత్​ కెమెరాకు చిక్కాయి. దసరా అనగానే ఆ పక్షి కోసం తహతహలాడే ప్రజలకు పాలపిట్ట దర్శనం కనువిందు చేసింది.

ఇదీ చూడండి: పండగపూట భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ

Last Updated : Oct 25, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.