భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడైనా ఇబ్బందులు, తీవ్ర సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. ఆర్టీఓ, తహసీల్దార్లు, మండల, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లతో ఆదివారం రాత్రి సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి వసతి కల్పించాలని తెలిపారు. రవాణా విషయంలో అప్రమత్తంగా ఉండాలని... చెరువులు, కుంటలకు గండ్లు పడితే పూడ్చడానికి ఇసుకబస్తాలు అందుబాటులో ఉంచుకోవాలని పాలనాధికారి సూచించారు.
గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 266 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 780 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆమె వివరించారు.
ఇదీ చూడండి: అప్రమత్తంగా ఉండాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశం