వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లికి చెందిన స్మితా రెడ్డి, జయంతీలు ఉన్నత చదువులు చదివి అమెరికాలో వైద్యులుగా స్థిరపడ్డారు. స్వగ్రామంలో ఉన్న సోదరుల సాయంతో.. కష్టాల్లో ఉన్న కరోనా బాధితులకు నిత్యావసరాలను, నగదును అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. గతేడాది మొదటి దశ లాక్డౌన్ నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వీరిద్దరూ గ్రామస్థుల మన్ననలు పొందుతున్నారు.
వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన మరో ఎన్ఆర్ఐ వైద్యురాలు యమున.. వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసి మాతృగడ్డపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారంతా కష్టకాలంలో స్వగ్రామంలోని పేదలకు సాయపడాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Cardiologist: మూడు నెలల్లోపు టీకాలిస్తే.. కరోనాను కట్టడి చేసినట్టే..