వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట శివారు కోనారెడ్డి చెరువులో గల్లంతైన వ్యక్తి జాడ లభించలేదు. జఫర్ఘడ్ మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన రాజేందర్ శుక్రవారం... చెరువులో చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు ఎంతవెతికిన ఆచూకీ లభించకపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌కి సమాచారం అందించారు.
స్పందించిన ఎమ్మెల్యే రమేశ్... ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి గాలింపు చేపట్టారు. సుమారు ఐదు కిలోమేటర్ల మేర జల్లెడ వేసినా ఆచూకీ దొరకలేదు.
ఇదీ చూడండి: ఉద్యోగం రాలేదని రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య