వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మున్సిపల్ కార్యాలయంలో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. పట్టణంలోని నెహ్రునగర్‌కు చెందిన కొక్కు అశోక్ ఇంటి నిర్మాణం కోసం అక్టోబర్ 30న దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వకుండా.. చెప్పులు అరిగేలా తిప్పించుకుంటూ.. రూ. 5 వేలు ఇస్తేనే అనుమతి ఇస్తానని కమిషనర్ చెప్పగా విసుగు చెందిన అశోక్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
ఈరోజు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్‌కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా కార్యాలయంలో ఉన్న కమిషనర్ వెంకటేశ్వర్లు.. జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కు డబ్బులు ఇవ్వాలని సూచించారు. సదురు అధికారికి డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'