వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మొక్కజొన్న విత్తనాలు తరలిస్తున్న 9 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన రైతులు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో లూజ్ విత్తనాలు కొనుగోలు చేసి తరలిస్తుండగా... నర్సంపేట పోలీసులు, వ్యవసాయాధికారులు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ధరకు వస్తున్నందున శంకరపట్నం నుంచి తెచ్చుకుంటున్నట్లు రైతులు తెలిపారు. ఎలాంటి అనుమతి లేనందున తమకున్న సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బాలల హక్కులపై అందరికీ అవగాహన తప్పనిసరి