ETV Bharat / state

కొత్తపల్లిలో అన్ని హంగులతో ఆధునిక​ వైకుంఠధామం

ఊరి శ్మశాన వాటికను ఆహ్లాదంగా తీర్చిదిద్దుకున్నారు ఆ గ్రామస్థులు. గతంలో ఎవరైనా తనువు చాలిస్తే దహనసంస్కారాలు చేసేందుకు నానా అవస్థలు పడేవారు. ఊరి వాగు ఒడ్డున పూడ్చి పెడితే... వానలు కురిసినప్పుడు ఒక్కోసారి మృతదేహాలు వాగులో కొట్టుకెళ్లేవి. ఇప్పుడు ఆ రోజులు పోయాయంటున్నారు కొత్తపల్లి గ్రామస్థులు. ఆధునిక హంగులతో.. రకరకాల పూల మొక్కలతో.. మానసిక ప్రశాంతతను ప్రసాదించే వైకుంఠధామాన్ని నిర్మించుకున్నారు.

కొత్తపల్లిలో అన్ని హంగులతో ఆధునిక​ వైకుంఠధామం
కొత్తపల్లిలో అన్ని హంగులతో ఆధునిక​ వైకుంఠధామం
author img

By

Published : Mar 18, 2020, 5:08 PM IST

కొత్తపల్లిలో అన్ని హంగులతో ఆధునిక​ వైకుంఠధామం

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో చనిపోయినవారికి దహనసంస్కారాలు చేసేందుకు సరైన ఏర్పాట్లు లేక గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పాతకాలం పద్ధతులకు స్వస్తి చెప్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో పాటు గ్రామ సర్పంచ్​ తోడ్పాటుతో గ్రామంలో అద్భుతమైన వైకుంఠధామం నిర్మించుకున్నారు. అధునాతనమైన నిర్మాణాలు చేపట్టి అనేక హంగులు జోడించారు. మృతదేహాలను ఖననం చేసేందుకు వచ్చిన వారికి మనోధైర్యాన్ని కలిగించే విధంగా చక్కని గార్డెన్​ ఏర్పాటు చేశారు. అందులో పూల మొక్కలు నాటారు. పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక స్నాన గదులు నిర్మించుకోవడమే కాక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా నీడనిచ్చే చెట్లు సైతం పెంచారు.

శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ:

పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామంలో సకల సౌకర్యాలతో కూడిన శ్మశాన వాటికలు సిద్ధమవుతున్నాయి. వీటి నిర్మాణం ప్రధానమని భావించిన రాష్ట్ర సర్కారు ఉపాధి హామీ నిధులు కేటాయించడం వల్ల పలుచోట్ల వైకుంఠధామాలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తపల్లిలో నిర్మించిన వైకుంఠధామానికి రూ. 10 లక్షలు కేటాయించగా మరో 3 లక్షలు అదనంగా కలుపుకొని మూడు నెలల్లో అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మించారు. ప్రాంగణంలో శివుడి విగ్రహం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. శ్మశాన వాటిక చుట్టూ ఇనుప కంచెతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బోరు ద్వారా.. మొక్కలకు, ఇతర అవసరాలకు నీటి సరఫరా చేసేందుకు వైకుంఠ పాలకులను కూడా నియమించారు.

ఆదర్శ గ్రామ నిర్మాణంలో భాగంగా చేపట్టిన వైకుంఠధామంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గ్రామ సర్పంచ్​, వార్డు మెంబర్లు తెలిపారు. గ్రామస్థులు, వారి బంధుమిత్రులు.. కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో ఇలాంటి వైకుంఠధామాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్ల నుంచి సరైన శ్మశాన వాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొన్న కొత్తపల్లి గ్రామస్థులకు ఈ నూతన వైకుంఠధామం ఆధ్యాత్మికతను, ప్రశాంతతను ఇస్తోంది.

ఇదీ చూడండి: శ్మశానంలోనే ఆవాసం.. గమ్యం చేరే చోటే జీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.