ETV Bharat / state

గిరిజన యూనివర్సిటీ పనులు వెంటనే మొదలుపెట్టాలి: సీతక్క - MLA Seethakka latest news

MLA Seethakka on Tribal University: ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ పనులు వెంటనే మొదలుపెట్టాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఏపీలో యూనివర్సిటీ పనులతో పాటు తరగతులు జరుగుతున్నాయని.. ఇక్కడ ఎందుకు ప్రారంభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానికి సీతక్క విజ్ఞప్తి చేశారు.

MLA Seethakka
MLA Seethakka
author img

By

Published : Nov 12, 2022, 4:58 PM IST

MLA Seethakka on Tribal University: ములుగు జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీ పనులు వెంటనే మొదలుపెట్టాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రం నుంచి యూనివర్సిటీకి కేటాయించిన భూమి వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ పొందుపరిచి ఉందని అప్పటి నుంచి రాష్ట్రంలో యూనివర్సిటీ పనులు జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీ పనులతో పాటు తరగతులు జరుగుతున్నాయని ఇక్కడ ఎందుకు ప్రారంభించడం లేదని సీతక్క మండిపడ్డారు. 8 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 390 ఎకరాల భూమిని కలెక్టర్, ఆర్డీవో ఆధ్వర్యంలో కేటాయించారని గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీ కోసం నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే సీతక్క హెచ్చరించారు.

గిరిజన యూనివర్సిటీ పనులు వెంటనే మొదలుపెట్టాలి: సీతక్క

"విభజన చట్టంలో ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్​కు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో నాలుగు సంవత్సరాల క్రితమే తరగతులు ప్రారంభమయ్యాయు. ఇక్కడ ఎనిమిదేళ్లయినా పనులు ప్రారంభం కాలేదు. ఎందుకు నిర్లక్ష్యం అని అడుగుతున్నాం. యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించాలి. అదే విధంగా వెంటనే పనులు ప్రారంభించాలి." - సీతక్క ఎమ్మెల్యే

ఇవీ చదవండి: వెయ్యి మంది కేసీఆర్​లు వచ్చినా మోదీని అడ్డుకోలేరు: కిషన్​రెడ్డి

హిమగిరిలో జోరుగా పోలింగ్ బారులు తీరిన ఓటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.