వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ పరిధిలోని కోనారెడ్డి చెరువు పూర్తిగా నిండింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అలుగు పారుతూ.. మత్తడి దూకుతుండడం వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే చెరువు కట్ట మీద ఉన్న కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్నడూ లేని విధంగా కోనారెడ్డి చెరువు పూర్తిస్థాయిలో నిండడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. చెరువు పరిసర ప్రాంతాలకు నీరు సమృద్ధిగా అందుతుందని ఆకాక్షించారు. ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'