వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండ మండలం ఆరేపల్లి శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ డీబీఎం 31 నుంచి నీటిని విడుదల చేశారు. దామెర క్రాస్ నుంచి నడికూడ, పరకాల వరకు మోటార్ సైకిల్ మీద కాలువను పరిశీలిస్తూ ప్రయాణించారు.
అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రాష్ట్రానికి అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
ఇదీ చూడండి : చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..