రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి పంటను అమ్మి లాభాలు పొందాలని పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి కోరారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో సీాసీఐ ద్వారా పత్తి కొనుగోలును ఆయన ప్రారంభించారు.
రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్మి రూ.5,800/- మద్దతు ధర తీసుకోవాలన్నారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
పత్తిలో తేమ 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్న కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోతుందని.. కాబట్టి రైతులు తేమ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చల్లా సూచించారు.
ఇవీ చదవండి: 'ప్రభుత్వం నోటిఫై చేసిన కులాలకే రిజర్వేషన్'