ETV Bharat / state

గుమస్తాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Warangal Rural District Latest News

పరకాల పట్టణంలో నివాస స్థలాల పట్టాలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. సీసీ రోడ్లు, డబుల్ బెడ్​రూం ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడనున్న కాలనీకి కేసీఆర్ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.

MLA Challa Dharmareddy distributing house papers
ఇళ్ల పత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
author img

By

Published : Jan 14, 2021, 10:02 PM IST

పరకాల పట్టణం జి.ఎస్.ఆర్ గార్డెన్స్​లో పనిచేస్తున్న 124మంది గుమాస్తాలకు ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సీసీ రోడ్లు, నల్లా కనెక్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఆ స్థాయి నుంచే..

గుమాస్తాగా పనిచేసే వారి కష్టాలేంటో అది అనుభవించిన వారికే తెలుస్తుందని అన్నారు. ఆయనా ఆ స్థాయి నుంచే వచ్చిన వాడినేనని తెలిపారు. పట్టాలు అందివ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

డ్రా పద్ధతిన..

పంపిణీ చేసిన భూమిని ఒక లేఅవుట్ తరహాలో తయారు చేసుకోవాలని సూచించారు. అందరి అంగీకారంతో డ్రా పద్ధతిన స్థలాలు కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. నూతనంగా ఏర్పడనున్న వీధికి కేసీఆర్ కాలనీగా పేరు పెడుతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

ఇదీ చూడండి: సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఇంట్లో బొమ్మల కొలువు.!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.