ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి బారిన పడకుండా రైతులందరూ కొనుగోలు కేంద్రాల వద్ద భౌతికదూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద శానిటైజేషన్, త్రాగునీరు వంటి ఏర్పాట్లను తప్పనిసరిగా చేయాలని అధికారులకు సూచించారు. టోకెన్ పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు చేయాలన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఎమ్మెల్యే కోరారు.