ETV Bharat / state

'మనసున్న ప్రజా నాయకుడు సీఎం కేసీఆర్​' - సీఎం కేసీఆర్​కు పాలాభిషేకం

వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేటలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ పాలాభిషేకం నిర్వహించారు. రైతుల కోసం కృషి చేసే మనసున్న ప్రజా నాయకుడని కొనియాడారు.

mla aruri ramesh praises cm kcr
'మనసున్న ప్రజా నాయకుడు సీఎం కేసీఆర్​'
author img

By

Published : May 9, 2020, 3:02 PM IST

కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికీ... రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న గొప్ప మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ కొనియాడారు. వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. లాక్​డౌన్ కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రుణ మాఫీకి రూ. 1210 కోట్లు విడుదల చేసినందుకు కేసీఆర్​కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి : భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.