వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై వాహన దారులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా హోటళ్లు, దాబాలు మూసివేయడం వల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
వివిధ నిత్యావసర సరుకులను వాహనాల ద్వారా చేరవేస్తున్న డ్రైవర్లకు, క్లినర్లకు భోజనాలు అందించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు