వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మిల్లర్లు, అధికారులతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లర్లు, అధికారుల సమన్వయ లోపం వల్లే కొనుగోళ్లు జరగడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే... సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతులు రోడ్లెక్కితే మిల్లర్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతామని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హెచ్చరించారు. ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలను మంజూరు చేయాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేాశారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు