ETV Bharat / state

ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టాలి.. ప్రతి ఎకరాను తడపాలి: మంత్రులు

ఎస్సారెస్పీ, లోయర్ మానేరు నుంచి నీటి విడుదలపై మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్​రెడ్డి, సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. వానాకాలం సాగు నీటి విడుదల ప్రణాళికపై... కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లా అధికారులతో చర్చించారు.

author img

By

Published : Jul 8, 2020, 7:17 PM IST

ministers-review-meeting-srsp-project-at-warangal
'ఏమి చేస్తే ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టుకు నీరు అందిచగలం'

కాళేశ్వరం ద్వారా సమృద్ధిగా జలాలు వస్తున్నందున... ఇక సాగు నీటి కొరత ఉండదని మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. శ్రీరాం సాగర్​ ప్రాజెక్ట్, లోయర్ మానేరు డ్యాం నుంచి నీటి విడుదలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.

'' కాళేశ్వరం పూర్తి స్థాయిలో మిడ్​మానేరుతో లింకై ఉంది కాబట్టి... నీళ్లకు కొదవ లేదు. ఈ విషయమై కరీంనగర్​, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా అధికారులతో ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎలా చేసుకుంటే చివరి ఆయకట్టుకు ఏ ఇబ్బంది లేకుండా నీరు అందించగలమో... ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు వారికి సహకరించాలి.''

- మంత్రి ఈటల రాజేందర్

నీళ్లతో చెరువులన్నీ నింపుకోవాలి. వర్షం వల్ల నీళ్లు వస్తున్నాయి, వరదల నీళ్లు, ఎస్సారెస్పీ ద్వారా వచ్చే నీళ్లను ఏవిధంగా వినియోగించుకోవాలని అనే దానిపై మనం ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆదరబాదర చెరువులకు నీళ్లు నింపేస్తే... కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి.

- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇదీ చూడండి: 'సమగ్ర రవాణా వ్యవస్థ అభివృద్ధికి కొత్త లాజిస్టిక్స్​ చట్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.