వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో పురఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తరఫున మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో తెరాస జెండాఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలో రెండువందల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
పట్టణం ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తెరాస అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. మంత్రితో పాటు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విరసం కార్యదర్శి కాశీంను హాజరుపర్చండి: హైకోర్టు ఆదేశం