వరంగల్ గ్రామీణ జిల్లాలోని అమీనాబాద్, రాజుపేటలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం నర్సంపేటలో హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడం కోసం ఎన్నో గిడ్డంగులను నిర్మించిందని మంత్రి గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా పంటల దిగుబడి పెరిగిందని.. ఇంకా గిడ్డంగులను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం నర్సంపేటలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసేందుకు డ్రోన్ యంత్రాలను నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ మహమ్మారి కనిపించకుండానే ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ప్రపంచ దేశాలను వణికిస్తుండడం వల్ల తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందన్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో 154కు చేరిన కరోనా కేసుల సంఖ్య