ETV Bharat / state

errabelli: కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : May 29, 2021, 10:06 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదని ఫిర్యాదులు అందడంతో ఓ కేంద్రాన్నిమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు(Minister Errabelli Dayarkar Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

minister errabelli surprise inspection
errabelli: కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం క‌ల్లెడలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు(Minister Errabelli Dayarkar Rao) ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని, వర్షాలు ముంచుకొస్తున్నాయని, ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని పలువురు రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి వారం రోజుల గడువులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

రైతుల‌కు ఇబ్బందులు క‌లుగ‌కుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని సేక‌రించాల‌ని, తేమ ఉన్న ధాన్యం రైతుల‌ను ఇబ్బంది పెట్టొద్దని అధికారుల‌కు తెలిపారు. త‌డిసిన ధాన్యాన్ని కూడా సేక‌రిస్తామ‌ని, రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని భరోసా క‌ల్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్ర‌భుత్వం రైతుల‌ నుంచి ధాన్యం సేక‌రించ‌డం లేద‌ని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

ఇదీ చూడండి: Tele Medicine : అటవీశాఖ సిబ్బంది కోసం టెలిమెడిసిన్ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.