వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి పట్టణ ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంచినీటి ప్లాంట్ దగ్గర గుంపులుగా గుమిగూడి ఉన్న ప్రజలను అలా ఉండకూడదని సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. తాను స్వయంగా ముగ్గు వేసి, ఆయా చోట్ల ప్రజలను నిలబెట్టి... కరోనా సమస్య తీరే వరకు ఈ పద్ధతి పాటించాలని మంత్రి సూచించారు. కరోనా ఇప్పటి వరకు గ్రామాల్లో లేనంత మాత్రాన... నిర్లక్ష్యంగా ఉండకూదని ప్రజలకు వివరించిన మంత్రి... కరోనా ఖతమయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఇవీ చూడండి: చిన్నపిల్లలకు కరోనా వస్తుందా.. వైద్యులు ఏమంటున్నారు?