వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు తెలుపుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ కొండూరు గ్రామ శివారు నుంచి మొదలుకొని... రాయపర్తి మండల కేంద్రం వరకు సాగింది. ముందుగా మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం ట్రాక్టర్, ఎడ్లబండ్లు నడిపి పార్టీ శ్రేణుల్లో, రైతుల్లో ఉత్సహాన్ని నింపారు.ఉత్సహంగా సాగిన ఈ సంఘీభావ ర్యాలీలో సుమారు వెయ్యి ట్రాక్టర్లు, ఐదు వందల ఎడ్లబండ్లు పాల్గొన్నాయి.