వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. అర్హత గల పట్టభద్రులంతా తప్పనిసరిగా తమ ఓట్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.
పట్టభద్రుల ఓట్లను నమోదు చేయాలని మంత్రి సూచించారు. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పార్టీ శ్రేణులు, ఇన్ఛార్జ్లు ఒక్కొక్కరితో మంత్రి స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ తప్పకుండా.. పకడ్బందీగా పార్టీ బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.