రైతు శ్రేయస్సు, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని తీగరాజుపల్లి, గవిచర్ల గ్రామాల్లోని రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికల నిర్మాణానికి రూ. 600 కోట్లు ఖర్చు చేస్తూ రైతులకు బాసటగా నిలిచామన్నారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల వలన పంటలు బాగా పండాయని, వాటిని ప్రభుత్వమే మద్దతు ధరతో కొంటుందని తెలిపారు. రైతులు పండించిన పంట ఆరబోసుకోవడానికి రూ. 500 కోట్ల ఖర్చుతో రైతు కల్లాలు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: టోకెన్లు ఇవ్వడం లేదంటూ మిర్యాలగూడలో రైతుల ధర్నా