పల్లె ప్రగతి కొనసాగింపుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ గ్రామీణ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాలను ఆకస్మిక తనిఖీలు చేసి... పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మురికి కాలువలను సమర్థవంతంగా నిర్వహించాలని సర్పంచ్, గ్రామ కార్యదర్శి, సిబ్బందిని మంత్రి ఆదేశించారు. కాలువలు శుభ్రంగా లేకపోతే, దోమలు, దుర్గంధం పెరిగి.. అంటువ్యాధులు ప్రబలుతాయని వివరించారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలన్నారు. అనంతరం అర్టీసీ బస్సును తనిఖీ చేసి.. తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పరిశుభ్రతను పాటించాలని.. మాస్కులు లేని ప్రయాణికులను బస్సుల్లో అనుమతించవద్దని.. నిర్ణిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని డ్రైవర్, కండక్టర్‌కు మంత్రి ఎర్రబెల్లి సూచించారు.