తెరాస ప్రభుత్వం.. కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధిని ఆపలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండలంలో రూ. 4 కోట్ల 97 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతోన్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండల ప్రజలకు రోడ్డు ప్రయాణం సుగమం కానుందన్నారు మంత్రి. రోడ్డును మంజూరు చేయించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రజలు రుణపడి ఉండాలని కోరారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: Harish rao: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత కేసీఆర్‌దే