ETV Bharat / state

'నేనూ రైతు బిడ్డనే'.. కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి - minister errabelli dayakar rao visited mgnrega works

Minister Errabelli: మంత్రి అంటే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకుని.. కాలనీల్లోకి వచ్చి ప్రజాసమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు ఆలోచిస్తారని మనకు తెలుసు. కానీ ఆ మంత్రి కూడా ఓ కూలీగా మారితే ఎలా ఉంటుందో మీకు తెలుసా.. పేదలతో కలిసిపోయి వారితో సరదాగా ముచ్చటిస్తూ వారి పనుల్లో భాగం పంచుకుంటే.. ఇక ఆ చుట్టుపక్కల అంతా సందడి వాతావరణమే.. పల్లె ప్రగతి కార్యక్రమానికి వెళ్తూ.. మార్గమధ్యలో అలాంటి వాతావరణమే కల్పించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

minister errabelli
కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jun 3, 2022, 4:37 PM IST

Minister Errabelli: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమానికి వెళ్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యలో తన రూటు మార్చారు. మార్గ మధ్యలో బంధనపల్లి గ్రామంలో ఆగి అక్కడ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి సరదాగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు ఆరాతీశారు. అనంతరం ఉపాధిహామీ కూలీలతో కలసి పలుగూపారా పట్టి కూలీగా మారారు. మట్టి తీస్తూ ఈ రోజు కూలీ మొత్తం 'నాకే' అంటూ అక్కడ నవ్వులు పూయించారు. మట్టి మోసి తానూ రైతు బిడ్డనే అంటూ వారితో కలిసిపోయారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ డబ్బులు సకాలంలో అందుతున్నాయా.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరాతీశారు. అనంతరం కొత్తూరులో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమానికి బయలుదేరారు.

గ్రామ పంచాయతీల చెక్కులు పెండింగ్‌లో లేవని... ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవి కూడా కేంద్రమే ఆపిందని ఎర్రబెల్లి తెలిపారు. నెల, రెండు నెలల క్రితం చేసిన పనులకు రూ. 650 కోట్లు విడుదల చేశామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదు చేసినందుకే... కేంద్రం వద్ద రూ. 800 కోట్లు ఆగాయని మంత్రి తెలిపారు. సర్పంచ్‌లు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు త్వరలోనే వస్తాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

'గ్రామ పంచాయతీలో ఏ చెక్కు కూడా పెండింగ్​లో లేదు. ఉపాధి హామీ బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. నెల, 2 నెలల క్రితం చేసిన పనులకు రూ.650 కోట్లు విడుదల చేశాం. ప్రతి నియోజకవర్గానికి రూ. 15 కోట్ల చొప్పున ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 150 కోట్లు ఇచ్చాం. కేంద్రం తరఫున రూ. 800 కోట్లు రావాల్సి ఉంది. బండి సంజయ్ ఫిర్యాదు చేసినందునే రూ.800 కోట్లు ఆగాయి. అవి గత సోమవారమే రావాల్సి ఉంది. సర్పంచ్​లు దిగులు చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మనకు రావాల్సిన నిధులు వస్తాయి.' -ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

బండి సంజయ్ ఫిర్యాదు చేసినందునే రూ.800 కోట్లు ఆగాయి: ఎర్రబెల్లి

ఇవీ చదవండి: 'హైదరాబాద్​లో ఈసారి ముంపు పూర్తిగా తొలగిపోతుందని గ్యారెంటీ ఇవ్వలేను..'

నీటిలో నుంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప.. ఊపిరాడక బాధితుడు విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.