లాక్డౌన్ కారణంగా రైతులకు అన్యాయం జరగొద్దనే.. అప్పు చేసి మరీ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి రైతులతో మాట్లాడారు. టోకెన్లు వచ్చిన వాళ్లే తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాలని అన్నారు.
కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన సాగు నీటి కారణంగా ఈ సారి అధిక దిగుబడులు వచ్చాయని తెలిపారు. కరోనా కారణంగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని... అందుకు గానూ రూ.30వేల కోట్లు అప్పు తెచ్చి రైతులను ఆదుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.రైతులు పండించిన ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 'ప్రతిగింజనూ కొంటాం.. రైతులకు అండగా ఉంటాం'