వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిని చూడటానికి ఇతర విదేశీయులు వస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గంగదేవిపల్లిలా వేల గ్రామాలు అభివృద్ధి అయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసమే సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించామన్నారు. నిధులు పక్కదారి పట్టించే సర్పంచులపై కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చే దాతలను ప్రోత్సహించాలని అసెంబ్లీలో సూచించారు.
పంచాయతీల్లో అందరూ భాగస్వామ్యం అయ్యేందుకు 4 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ట్రాక్టర్లు అందని 420 గ్రామాలకు త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచుతాం: కేసీఆర్