ETV Bharat / state

Errabelli in palle pragathi: అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఎర్రబెల్లి - ఎర్రబెల్లి దయాకర్​ రావు

Errabelli in palle pragathi: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తెలిపారు. విధుల పట్ల అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.

Errabelli  in palle pragathi
పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు
author img

By

Published : Jun 15, 2022, 8:09 PM IST

Updated : Jun 15, 2022, 11:04 PM IST

Errabelli in palle pragathi: గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎవరైనా వినకుంటే జరిమానాలు సైతం విధించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు.

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఎర్రబెల్లి

గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల్లో మంత్రి స్వయంగా చెత్త ఎత్తి ట్రాక్టర్​లో పోశారు అంతకముందు గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్​తో కలిసి వాలీబాల్ ఆడి చూపరులను ఆకట్టుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులంతా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకావాలని మంత్రి కోరారు. గ్రామాల్లో వెలువడుతున్న ప్లాస్టిక్, గాజు సీసాలను సేకరించి పర్యావరణం కాపాడాలని చెప్పిన తనను కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శించడం తగదని హితవు పలికారు. అలాగే అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పిల్లలచేత అక్షరభ్యాసం: ప్రభుత్వ పాఠశాల చేరిన పిల్లలకు మంత్రి ఎర్రబెల్లి అక్షరాభ్యాసం చేయించారు. కాట్రపల్లిలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని విద్యార్థులను ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయ . ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నామని.. తల్లిదండ్రులు సర్కారు బడుల్లో తమ పిల్లలను చెర్పించి వారి బంగారు భవితకు తోడ్పాటు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Last Updated : Jun 15, 2022, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.