ETV Bharat / state

గాడిపెల్లి గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వార్తలు

ఆయనో మంత్రి.. అయితేనేం కాసేపు ఆ పదవిని మరిచి సాధారణ వ్యక్తిలా మారిపోయారు. తన నియోజకవర్గ పరిధిలోని గ్రామస్థులను అటుగా వెళ్తూ ఆప్యాయంగా పలకరించారు. యువకులతో కలిసిపోయి వారితో సరదాగా ముచ్చటించారు. పెద్దవాళ్లను పలకరించి మంచి చెడు తెలుసుకున్నారు. ఆయనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు..

minister errabelli dayakar rao, gadipelli village
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు
author img

By

Published : Feb 24, 2021, 7:01 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలోని త‌న స్వ‌గ్రామం ప‌ర్వ‌త‌గిరికి వెళుతూ మార్గ‌మ‌ధ్యలో ఖిలా వ‌రంగ‌ల్ మండ‌లం గాడిపెల్లి ప్ర‌జ‌ల‌ను పలకరించారు.. పంచాయతీరాజ్ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గ్రామంలో ఇళ్ల ముందు కూర్చుని ముచ్చ‌టిస్తున్న యువ‌కుల‌ వద్దకు నేరుగా వెళ్లి వాళ్ల తల్లిదండ్రుల వివరాలను ఆరా తీశారు. కిరాణా దుకాణం అరుగుల వద్ద కూర్చున్నవృద్ధుల వద్దకెళ్లి గ్రామ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయని వాకబు చేశారు.

minister errabelli dayakar rao, gadipelli village
వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ గ్రామానికి వచ్చే వాడినని మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే.. ప్రస్తుత మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్​ రావు తమతో మాట్లాడటం సంతోషం కలిగించిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మంత్రి అయినా సాదా సీదా వ్యక్తిత్వం అంటూ కితాబిచ్చారు గాడిపెల్లి ప్రజలు.

ఇదీ చదవండి: రాజ్​భవన్​ రాసిచ్చినా రిజిస్ట్రేషన్​ చేయించుకుంటారా..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.