సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేటను.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పట్టణంలోని అంగడి మైదానంలో నూతనంగా నిర్మించిన అధునాతన కూరగాయల మార్కెట్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మరింత అభివృద్ధి చేస్తారని మంత్రి అన్నారు. రూ. రెండు కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, రైతులు తనను ఆశీర్వదించి ఇంతటి స్థాయికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిని కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: FCI RICE: 'ఉప్పుడు బియ్యం వద్దు.. ముడి సరకు ఇవ్వండి'