ETV Bharat / state

మామిడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

తరుగు, కమిషన్ల నష్టాలు లేకుండా నేరుగా రైతులకు లాభం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. దళారుల బెడదను నివారించెందుకే మహిళా సంఘాలను సంఘటితం చేసి నేరుగా మామిడి అమ్మకాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

minister errabelli dayakar rao
మామిడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Apr 7, 2021, 1:04 PM IST

మామిడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్​నగర్ గ్రామంలో డీఆర్​డీఏ, సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మామిడి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రారంభించారు. మ‌హిళ‌లు స్వ‌యం స‌మృద్ధిని సాధించ‌డానికి డ్వాక్రా మ‌హిళా సంఘాల‌ను ఏర్పాటు చేశామన్నారు. పేద‌రిక నిర్మూల‌న సంస్థ సెర్ఫ్​కి అనుసంధానంగా ఈ సంఘాలు ప‌ని చేస్తున్నాయి. కేవ‌లం పొదుపు, సేవా దృక్ప‌థంతో మాత్ర‌మే ప‌ని చేసిన మ‌హిళా సంఘాల‌ను వ్యాపారం వైపు మ‌ళ్లిస్తున్నామని మంత్రి తెలిపారు. పామాయిల్ సాగును రైతులు అలవర్చుకోవాలని... లాభాలు ఉంటాయని అన్నారు. తాను 50 ఎకరాల్లో పామాయిల్ సాగు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్ప‌టికే డ్వాక్రా సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదే త‌ర‌హాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధిలో భాగంగా, ఆచార్య శ్రీ‌ కొండా ‌ల‌క్ష్మ‌ణ్ తెలంగాణ ఉద్యాన యూనివ‌ర్సిటీ స‌హ‌కారంతో పైల‌ట్ ప్రాజెక్టుగా డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌ను మ‌రింత సంఘ‌టితం చేస్తున్నామని మంత్రి తెలిపారు. స‌న్న‌, చిన్న కారు రైతుల‌కు ఆర్థిక స‌హాయం చేస్తూ, పండ్ల ఉత్ప‌త్తి దారుల‌కు, కొనుగోలు సంస్థ‌ల‌కు మ‌ధ్య‌ సెర్ఫ్​ వేదిక‌గా నిలుస్తోందన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 21 జిల్లాల్లో 25 ఎఫ్​పీవోలు ఏర్ప‌డ్డాయని... ఒక్కొక్క సంఘంలో 8 వంద‌ల‌ నుంచి 12 వంద‌ల మంది స‌భ్యులుగా ఉన్నారన్నారు. ఈ ఏడాది 100 ఎఫ్‌పీవోల‌ ఏర్పాటే ల‌క్ష్యమని... వీటి ద్వారా దాదాపు 2 ల‌క్ష‌ల మంది ల‌బ్ధి పొందుతారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఖమ్మంలో సైకిల్‌పై మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.