Minister Errabelli: ధాన్యం కొనుగోళ్లపై భాజపా నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన 300మంది లబ్ధిదారులకు 3కోట్ల రూపాయల.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను భాజపా కాపీ కొడుతూ.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుకుంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరచడం హేయమైన చర్యగా మంత్రి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్న వారికి గుణపాఠం చెప్పాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన కొనియాడారు.
కాపీ కొడుతున్నారు..
భాజపా, కాంగ్రెస్ నేతల మాటల నమ్మొద్దు. కాంగ్రెస్ హయాంలో 30 ఏళ్ల పాటు కాలువలు తీశారు కానీ చుక్కనీరు రాలే. కేసీఆర్ వచ్చిన తర్వాత కాలువల్లో 365 రోజుల పాటు నీళ్లు పారుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మన సంక్షేమ పథకాలను భాజపా కాపీ కొడుతోంది. దొడ్డురకం వడ్లను వేయొద్దని ప్రభుత్వం చెప్పింది.. కానీ వేయండని బండి సంజయ్ చెప్పారు. దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లపై భాజపా నేతలు, బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలి.
-ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ఇదీ చదవండి: