కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఆ పార్టీ నేతలకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో తెరాస సభ్యత్వ నమోదు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రానికి కాంగ్రెస్, భాజపా ఏం చేశాయో చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తాము అభివృద్ధి చేస్తున్నామని.. ఇక ముందూ చేస్తామని.. లేకుంటే ఓట్లే అడగబోమని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
ఎన్నికల లోపల నిరుద్యోగ భృతి అందిస్తాం. లేకుంటే ఓట్లే అడగం. లాటరీతో సంబంధం లేకుండా పేదలకు ఇళ్లు కట్టిస్తాం. ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు సబ్సీడి కింద రూ.5 లక్షలు ఇస్తాం.. ఈ పథకాన్ని ఈ ఏడాది బడ్జెట్లో ప్రవేశపెడుతున్నాం. తాము అభివృద్ధి చేశాం.. ఇకముందు చేస్తాం.. చేయకుంటే ఓట్లు అడగం. కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రానికి ఏం చేశాయో చెప్పాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరినా పట్టించుకోలేదు.
-ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ఇవీచూడండి: విద్యార్థులకు నష్టం జరిగితే ఎవరినీ వదిలిపెట్టం: బండి సంజయ్