ETV Bharat / state

తెరాసపై రైతుల అభిమానం చూసి అవాక్కైన ఎర్రబెల్లి - Warangal Rural District Latest News

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వరంగల్​ గ్రామీణ జిల్లాలో పర్యటన ముగించుకుని వెళ్తున్నారు. ఇంతలో ఓ గ్రామ పంటపొలాలు కనిపించాయి. కాన్వాయి ఆపి.. ఆ పంటపొలాల దగ్గరకు వెళ్లారు. రైతులు తెరాసపై చూపిస్తున్న అభిమానాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. అసలు వాళ్లు ఏం చేశారంటే..?

minister Errabelli Dayakar expressed happiness over the setting up of the Trs flag in the Farms at Illanda village, Warangal Rural District
తెరాసపై రైతుల అభిమానం.. చూసి అవాక్కైన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Oct 6, 2020, 2:35 PM IST

తెరాసపై రైతులు అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమ పొంట పొలాల్లో తెరాస జెండా ఏర్పాటు చేసుకుని సీఎం కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారు. తెరాసా రైతులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలకు కృతజ్ఞత చూపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుని వెళ్తున్న క్రమంలో... వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పంటపొలాల్లో.. కేసీఆర్ చిత్రపటంతో కూడిన గులాబీ జెండాలు ఏర్పాటు చేసుకున్నారు రైతులు.

minister Errabelli Dayakar expressed happiness over the setting up of the Trs flag in the Farms at Illanda village, Warangal Rural District
తెరాసపై రైతుల అభిమానం

అది గమనించిన మంత్రి ఎర్రబెల్లి తన కాన్వాయిని ఆపి రైతుల వద్దకు వెళ్లి పరవశించిపోయారు. తాను ఓ జెండా పట్టుకుని రైతులతో కొంత సమయం గడిపారు. ప్రభుత్వం అందిస్తున్న పంటపెట్టుబడి, రైతు బీమాపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

రైతులు తెరాసా పట్ల చూపుతున్న ఆప్యాయత చలింపజేసిందన్న మంత్రి... కేసీఆర్ పాలనలో గ్రామీణ రైతులు సగౌర్వంగా జీవిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. మంత్రి తమతో పంటపొలాల్లో మాట్లాడటం పట్ల సంతోశం వ్యక్తం చేశారు రైతులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.