వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో పొలం దున్నారు. వరి పొలంలో నాటు వేసి... తన కుమారుడు ఎర్రబెల్లి ప్రేమ్ చందర్ రావుకు వ్యవసాయ పద్ధతులను వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటి కాలువలు పరిశీలించారు.
హంగు ఆర్బాటాలు లేకుండా మామూలు వ్యవసాయ రైతులాగా పంట పొలాల్లో తిరుగుతూ పొలం పనులపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. వ్యవసాయ క్షేత్రంలో బావి నిండా నీళ్లు ఉండడం గమనించారు. మామిడి తోటను పరిశీలించారు.
ఇవీ చూడండి: న్యాయం చేయాలని కోరిన డీఎస్సీ 1998 అభ్యర్థులు