వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గాకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులు.. తినేందుకు లడ్డూను రెండు ముక్కలు చేశారు. లోపల మొత్తం బూజు పట్టి కనిపించడంతో ఆగ్రహానికి గురై.. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
![annaram shareef dargah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-38-16-annaram-shareef-kullina-laddulu-av-ts10144_16042021194227_1604f_1618582347_154.jpg)
సరైన స్పందన రాకపోవడంతో భక్తులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తే.. ఇలా పాడైనా లడ్డూలు ప్రసాదంగా ఇస్తారా అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల