వరంగల్ పట్టణజిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. కరీంనగర్ నుంచి వరంగల్ వస్తున్న అయిల్‌ట్యాంకర్, వరంగల్ నుంచి కరీంనగర్‌కి కర్రలతో వెళ్తున్న లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి.
ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ షకీర్ గంటన్నరపాటు క్యాబిన్‌లో చిక్కుకుపోయి నరకయాతన అనుభవించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను అతి కష్టంమీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి: అక్కన్నపేటలో కాల్పుల కలకలం