వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో విత్తనాల విక్రయ డీలర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విత్తనాలు విక్రయించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ అనుమతి ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి డీలర్ రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. వాటిని రైతులు పంటకాలం పూర్తయ్యేంతవరకు దాచుకోవాలన్నారు. విత్తన విక్రయదారులు వ్యవసాయశాఖ నియమ నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవీ చూడండి: స్ట్రాంగ్ రూం వద్ద ఉత్తుత్తి సీసీ కెమెరాలు