వరంగల్ ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞంలా సాగుతోంది. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామీణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.
వీధులన్నీ తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు కోరారు. రోడ్లు డ్రైనేజీ పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
ఇదీ చూడండి : తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు