కార్తీక మాసం ప్రారంభమైంది. పవిత్ర మాసం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర ఆలయం హర హర మహాదేవ అంటూ శివనామస్మరణతో మారుమోగుతోంది.
భక్తుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే మహదేవుడు ఇక్కడ కుంకుమేశ్వర స్వామిగా కొలువై... భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారికి అర్చకులు కార్తీక మాస ప్రత్యేక పూజలు చేశారు.