వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 152 మంది లబ్ధిదారులకు చెక్కులను, పాసుపుస్తకాలను అందజేశారు.
కల్యాణ లక్ష్మీ చెక్కు అందుకున్న ఓ యువతి భావోద్వేగానికి లోనైంది. తన పెళ్లికి తల్లిదండ్రులు అప్పు చేశారని.. కేసీఆర్ తమ బిడ్డల్లా తమను ఆదరించి కల్యాణలక్ష్మీ చెక్కులను అందించి తమకు అండగా నిలిచారని పేర్కొంది.
పట్టాదారు పాసుపుస్తకాలు అందుకోడానికి 500 మంది రాకపోవడమేంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. త్వరలో వీటితో పాటు మరో 1,000 మందికి పాసు పుస్తకాలను అందజేస్తామని పరకాల ఆర్డీవో కిషన్ తెలిపారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం